వరి విత్తన సాగు విస్తీర్ణం తగ్గుముఖం
ఉత్తర తెలంగాణలోనే విత్తనోత్పత్తికి అనుకూలమైన కరీంనగర్ జిల్లాలో ఈసారి వరి విత్తన సాగు తగ్గిపోయింది. జిల్లాలో అత్యధిక శాతం హుజూరాబాద్ వ్యవసాయ డివిజన్లోనే విత్తన సాగు అవుతోంది. కానీ గతేడాది విత్తన సాగు చేసిన రైతులకు సీడ్ ప్లాంట్ల యజమానులు, విత్తన కంపెనీలు ఆశించిన ధర చెల్లించకపోవడంతో పాటు ఈసారి సాగునీటి లభ్యత అనుకూలంగా లేకపోవడంతో రైతులు ఆసక్తిగా లేరు. దీంతో గతేడాది కంటే ఈసారి 10,992 ఎకరాల్లో విత్తన సాగు తగ్గింది.