వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వసాయం !!
యాసంగి పంటలు చేతికొచ్చే దశలో హఠాత్తుగా వర్షాలు పడటంతో రైతులను తీవ్రంగా దెబ్బకొట్టింది. మూడు రోజులుగా ఊదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాల కారణంగా కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలో దాదాపు 38 వేల ఎకరాల్లో వరి, జొన్న, మొక్కజోన్న, మిర్చి, పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. కోతకు వచ్చిన పంట నేలరాలిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వ్యాపారులకు సూచించారు. అవసరమైతే రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.