ఈ ఏడాది వర్షాలు జోరు..... !!
ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశం ఉందని, జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధికంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రుతుపవనాల ఆధారంగా 2024 వర్షాకాలం సీజన్ లో 106 శాతం మేర వర్షాలు కురుస్తాయని మరియు తూర్పు, వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అన్ని చోట్లా నైరుతి రుతుపవనాలు బాగానే ప్రభావితం చేస్తాయని వాతావరణ శాఖ అంచన వేసింది.