పౌల్ట్రీ ఫార్మ్ చేయాలనుకుంటున్నారా ?
పౌల్ట్రీ ఫార్మ్ ఒక అనువైన వ్యాపారం. చాలా మందికి పౌల్ట్రీ ఫార్మ్ మొదలుపెట్టాలని ఉన్నా, దీనికి సంబంధించిన శిక్షణ ఎక్కడ దొరుకుతుందనే సందేహం ఉంటుంది. అయితే సెంట్రల్ ఏవియన్ రెసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(EDP) లో బాగంగా మే 13 నుండి మే 17 వరకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు Online మరియు Offline విధానంలో హాజరు కావచ్చు. దీనిలో పౌల్ట్రీ కోళ్ల పెంపకం, నాణ్యమైన గుడ్ల ఉత్పత్తి గురించి దానితో పాటుగా ఆర్గానిక్ విధానంలో కోళ్ల పెంపకం, మరియు నాటుకోళ్ల పెంపకం, మార్కెటింగ్ విధానాలు ఇలా అనేక అంశాల మీద అవగహన కల్పిస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నమోదు చేసుకోండి. ఈ కార్యక్రమం కోసం 2024 మే 10 వరకు నమోదు చేసుకోవచ్చు.