ఈ నెల 31న కేరళకు నైరుతి ఋతుపవనాలు !!
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడి అది 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకాయని, చురుగ్గా కదులుతున్నట్లు హైదరాబాద్ ఐంఎండీ తెలిపింది. ఈ నెల 31న కేరళను తాకుతాయని, తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తా యని అంచనా వేసింది. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.