ఈ వానాకాలం 2024 కి పత్తి విత్తనాలు కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు
• బోల్ గార్డ్ II ప్యాకెట్ 864 /- రూపాయలు మాత్రమే. • మీరు కొనే విత్తనాలకి సంబంధించి బిల్ ( రశీదు ) తీసుకోవాలి. • లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. • పత్తి దిగుబడి వచ్చేవరకు బిల్ రైతు దగ్గరనే భద్రపరుచుకోవాలి. • తీసుకున్న రశీదు మీద విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నెంబర్ , లాట్ నెంబర్, రేటు ఉండాలి. • విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలి ప్రతి విత్తన ప్యాకెట్ మీద GEAC నెంబర్ ఉందా లేదా చూసుకోవలెను. • మీ గ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు మీ మండల వ్యవసాయ అధికారికి చెప్పండి. • పక్క జిల్లా నుండి పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఎవరైనా నకిలీ విత్తనలు, లూస్ విత్తనాలు అమ్మినచో వ్యవసాయ అధికారులను సంప్రదించండి. • దయచేసి తొందరపడి లైసెన్స్ లేని వారి దగ్గర విత్తనాలు తీసుకొని ఇబ్బంది పడకూడదు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ అధికారులు జారి చేయబడినది.