వర్షాలు వచ్చేసాయి......!!
నైరుతీ రుతుపవనాలు కేరళ అంతా విస్తరించాయి రానున్న రెండు రోజుల్లో మిగతా దక్షిణ భారతదేశం అంతా విస్తరించనున్నాయి. కావున తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని IMD తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం నుంచి మేఘాలు బాగా విస్తరిస్తాయని , ఉదయం 9 తర్వాత ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉందని IMD తెలిపింది. మధ్యాహ్నం 1 గంట నుంచి కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. .(Image credit - IMD)