పత్తి విత్తనాలను విత్తుకోవడానికి సరైన సమయం ?
తొందరపడి ముందుగానే వేసుకుంటే పత్తి తీసే సమయానికి భారీ వర్షాల వలన నష్టం జరుగుతుంది.ఆలస్యంగా నాటుకుంటే పత్తిలో గులాభి రంగు పురుగుల సమస్య పెరిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కావున సరైన సమయానికి విత్తుకోవడం చాలా ముఖ్యం. వానలు పడుతున్నాయని తొందరపడి విత్తుకోకుండా ఒక పెద్ద వాన (60 mm నుండి 70 mm వర్షపాతం) నమోదైన తరువాత విత్తుకోవడం వలన మొలకశాతం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికి అనువైన సమయం జూన్ 15 నుండి జూలై 15 వరకు అని వ్యవసాయ శాస్రవేత్తలు తెలిపారు.