వరికి మద్దతు ధర 117 పెంపు !!
బుధవారం రోజు జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో కేంద్ర సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో వరికి మద్దతు ధర (MSP) ని 5.35% పెంచారు.అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. 2013-14 మద్దతు ధరతో పోల్చితే ఇది రూ.1,310 ఎక్కువ. వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో పాటు జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర సర్కారు పెంచింది.