రాష్ట్రంలో మొక్క జొన్న సాగు భారీగా పెరగనుంది..... !!
గత ఏడాది మక్కలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పౌల్ట్రీకి దాణాగా వినియోగం, బిస్కెట్లు, పాప్కార్న్లు, ఇతర ఉత్పత్తుల కోసం మొక్కజొన్న అవసరముంది. మరోవైపు ప్రభుత్వం మద్దతు ధరల భరోసా కోసం మార్క్ ఫెడ్ ద్వారా కేంద్రాలు తెరిచింది. జీవ ఇంధనమైన ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్నలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి పరిశ్రమలు కొనుగోలు చేశాయి. దేశంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 2025 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథ నాల్ కలిపి వాహనాలు వినియోగించేందుకు వీలుగా ఉత్పత్తిని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా మొక్కజొన్న సాగు పెంపుపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు ఇటీవల నిర్వహించారు. దేశంలో 2025 నాటికి పెట్రో వాహనాలకు ఇథనాల్ అవసరాల దృష్ట్యా మక్కల సాగు పెరగా లని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా కొత్త రకాల రూప కల్పన జరుగుతోంది. మరోవైపు నీటిలభ్యత కూడా మక్కల సాగు పెరు గుదలకు కారణమని వ్యవసాయశాఖ భావిస్తోంది.