సైబర్ నేరగాల్లతో రైతులు జాగ్రత్త !!
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో పడుతుండగా సైబర్ నేరగాళ్ళు లింకులు పంపి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. బాంకు పేర్లు వివరాలను చూసి మోసపోవద్దు అని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఇలాంటి అనవసర మెసేజ్ లను, ముఖ్యంగా APK రూపంలో వచ్చేవి అస్సలు క్లిక్ చేయవద్దు. దాని వలన మీ అకౌంట్ లో ఉండే డబ్బులను కోల్పోవడం జరుగుతుంది కావున అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి మీరు ఎదుర్కున్నట్లితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించాలని తెలిపారు.