ఏపి రైతులందరికీ పంటల బీమా!!
నోటిఫై చేసిన పంటలు, సాగు చేసే రైతులందరికీ పంటల బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆధికారులను ఆదేశించారు. విపత్తుల వేళ నష్టపోయే ప్రతి రైతుకు న్యాయం జరిగేలా బీమా అమలు చేయాలని సూచించారు. మెరుగైన పంటల బీమా అమలు, దిగుబడి ఆధారంగా, వాతావరణ పరిస్థితులను బట్టి బీమా అమలు, క్లెయిమ్ల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించామని, ఇందుకు సంబంధించి నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం పంపుతామని మంత్రులు తెలిపారు. గతంలో బీమా లేక నష్టపోయిన మామిడి రైతులకు కూడా పంటల బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.