వ్యవసాయరంగానికి బడ్జెట్ లో ఎంత ??
2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఉత్పాదకతకు మరియు స్థితిస్థాపకతకు మొత్తం 1.52 లక్షల కోట్లు రూపాయిల నిధులు కేటాయించారు. రానున్న రెండేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాలు ప్రోత్సాహం. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి, అధిక అధిక దిగుబడినిచ్చే, 109 హై-యీల్డింగ్ రకాలను విడుదల చేసారని నిర్మల సీతారామన్ తెలిపారు. పప్పుదినుసులు మరియు నూనే గింజలలో సమృద్ది మరియు కూరగాయల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున క్లస్టర్లు అభివృద్ధి సహకార సంఘాలు, స్టార్టప్ లకు మరియు రొయ్యల పెంపకం మరియు ఎగుమతి ప్రభుత్వం ప్రోత్సాహం చేయబోతున్నామని తదితర వ్యవసాయ విషయాలను ఆర్థిక మంత్రి చెప్పారు.