27 Jul , 2024

రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు !!

మొత్తం బడ్జెట్‌ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా అందులో వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రభుత్వం 72,659 కోట్ల రూపాయలు రైతాంగానికి కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.22,572 కోట్లు ఎక్కువ. రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా పథకాలకు ఈ నిధులను వినియోగించనుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ ఏడాది నుంచి కొత్తగా భూమిలేని రైతు కూలీలకు కూడా ఏటా రూ.12 వేల సాయం అందించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది.