పత్తిలో ఒకేసారి - ఎరువులు వేయడం...కలుపు తీయడం...!!
తెలంగాణలో పత్తి పంట అధికంగా సాగవుతుంది. అయితే పంటకు ఎరువులు, కలుపు ఒకేసారి పిచికారి చేస్తే ఖర్చు, శ్రమ రెండు తగ్గుతుందని – నల్గొండ, చిట్యాల మండలం మొగిలిదొరి గ్రామానికి చెందిన కొండె శ్రీశైలం - అలోచించి తనకున్న మూడెకరాల పొలంలో ఆధునిక సాగుయంత్రమైన మినీట్రాక్టర్ సాయంతో ఏడు నాగళ్ల సెట్ తో కూడిన కల్టివేటర్, దానిపైన డబ్బా బిగించాడు. ఆ డబ్బా నుంచి ఎరువు సాళ్లకు కొద్దిదూరంలో పడేవిధంగా ముందు వరుసలోని నాగళ్ల వరకు పైపులను అమర్చాడు. పత్తిలో సాళ్ల మధ్య గల కలుపు మొక్కలను తొలగించడానికి కల్టివేటర్ తో దున్నడంతోపాటు ఒకేసారి మూడు వరుసలలోని మొక్కలకు ఎరువు వేయొచ్చు. ఎకరం పత్తిచేలో కలుపు తీయడానికి మరియు ఎరువు వేయడానికి గంట సమయం పడుతుంది. ఎకరాకు 2 లీటర్ల డీజిల్ అవసరం. దీనివల్ల ఏకకాలంలో రెండు పనులు పూర్తి కావడంతో పాటు సగానికిపైగా ఖర్చు, సమయం ఆదా అవుతోంది.