05 Sep , 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!

రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ, ఉత్తరాంధ్ర, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నాలుగు రోజులపాటు వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈసారి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ అల్ప పీడనం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని ఐఎండీ సూచించింది.