పంట బీమా పథకం ఈ-కేవైసీకి ఈ నెల 15కు ముగుస్తుంది !!
ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన రైతులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.పంట బీమా పొందేందుకు రైతులు తమ పంటలకు ఈ-కేవైసీ చేయించుకోవాలి. దీని గడువు ఈనెల 15 వరకు ఉంది. "పంట బీమా పథకం" కొరకు ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలను వ్యవసాయశాఖ సిబ్బందికి తెలియజేయాలి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు ఈకేవైసీ ప్రక్రియ మొదలైంది. తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ చేస్తారు. రైతు ఆధార్, మొబైల్ నంబర్, పొలం సర్వే నంబర్ తో పాటు పొలం వద్ద ఫొటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేస్తారు. పంట నమోదు పూర్తైన తర్వాత ఈ-కేవైసీకి వేలిముద్రలు తీసుకుంటారు.