తెల్లపత్తికి భిన్నంగా గోధుమ పత్తి:
ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు విశేష పరిశోధన చేసారు. సాధారణ తెల్లపత్తితో పాటు గోధుమ రంగు పత్తిని సాగు చేశారు. ఈ గోధుమ పత్తిని కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో పండిస్తున్నారు. తెల్లపత్తి కంటే దీని దిగుబడి ఎక్కువగా ఉందని గోధుమ రంగు పత్తికి ధర కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ పత్తి సాగుపై ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. వివరాలు: వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆదిలాబాద్