08 Nov , 2024

వ్యవసాయంలో మహిళలకు సమాన హక్కులు

వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ(మేనేజ్)లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, ఇక్రిశాట్ల ఆధ్వర్యంలో గురువారం వ్యవసాయ విస్తరణలో లింగ సమానత్వం, విధానాలు, సంస్థల్లో, కార్యక్రమాల్లో భాగస్వామ్యం అంశంపై అంతర్జాతీయ కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో మహిళలు కీలకంగా ఉన్నారని, వారికి భవిష్యత్తు విస్తరణ విధానాల్లో సరైన భాగ స్వామ్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమాల రూపకల్పన, అమలు, ఆవిష్కరణలు, పరిశోధనల్లోనూ గ్రామీణ స్థాయి నుంచి మహిళలకు పెద్దపీట వేయాలన్నారు. మహిళా రైతులకు శిక్షణ అందిస్తే వ్యవసాయంలో మరింత రానిస్తారారు అని కొనియాడారు.