08 Nov , 2024

శనగ విత్తనాలకు 300 రూపాయల సబ్సిడీ!

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ శనగ రైతుల ప్రయోజనాల కోసం క్వింటాల్‌కు 300 రూపాయల సబ్సిడీని ప్రకటించారు. క్వింటాల్ కి Rs.9000 ధర ఉండగా, Rs.300 రాయితీతో , రైతులు Rs.8700 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ రేపటి నుండి అమలు కానుంది. ఈ యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన శనగ విత్తనాలు, JG 11, Jaaki రకాల 20,000 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అదనంగా, ఈ రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన వరి విత్తనాలు సమయానికి రైతులకు అందుబాటులో ఉండేలా వీలైనంత త్వరగా గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు.