13 Nov , 2024

రైతులకు గుడ్ న్యూస్ – యాసంగిలో రాయితీపై యంత్రాలు !!

తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలను సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకం కింద రోటావేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు అందిస్తామని తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.