22 Nov , 2024

🌧️ఏపీకి భారీ వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం 🌀

బంగాళాఖాతంలో శనివారం ఏర్పాడే అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వానగండం పొంచి ఉంది. పంటలు చేతికొచ్చే కాలం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. దీని ప్రభావంతో నవంబర్‌ 26,27తేదీలలో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది.