06 Dec , 2024

మ్యాజిక్ రైస్ వేడి నీళ్ళు లేకుండా అన్నం రెడీ!!

అగోనిబోరా రైస్ లేదా మ్యాజిక్ రైస్ పాలక్కాడ్‌లో ఉన్న ఎలప్పుల్లి లోని అథాచి గ్రూప్‌కి చెందిన వ్యవసాయ క్షేత్రం ద్వారా సాగు చేయబడింది. ఉడికించే అవసరం లేకుండా కేవలం వేడి నీటిలో 15 నిమిషాలు లేదా చల్లని నీటిలో 30 – 45 నిమిషాలు నానబెడితే చాలు ఉడికిపోతుంది. జూన్ లో ప్రారంభం అయిన పంట ఇటీవల పంట కోతకు వచ్చింది. విత్తనాలను మొలకెత్తించి 20 రోజుల తరువాత పొలంలో నాటారు. ప్రకృతి వ్యవసాయంలో పండించారు. కీటకాల బెడద చాలా తక్కువగా ఉంది. వరి మొక్క 3 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. 100 – 110 రోజులలో కోత కోశారు. 12 సెంట్లు భూమిలో 170 కిలోలు వరి పండించారు.