రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకైనా తీసుకెళ్లే స్వేచ్ఛ ఉందని సీఎం తెలిపారు. అలాగే, సేకరించిన ధాన్యం పేమెంట్‌ను 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు