11 Dec , 2024

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు!

అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుంది . మొక్కలకు 90శాతం సబ్సిడీ, డ్రిప్కు ఎస్సీ ఎస్టీలకు 100శాతం, బీసీలకు 80శాతం, నాలుగేళ్ల వరకు నిర్వహణకు ఎకరాకు రూ.4.200 అందిస్తుంది. నాలుగు సంవత్సరాల నుండి పంట దిగుబడి మొదలై 35 సంవత్సరాల వరకు వస్తుంది. ఈ పంటకు చీడపీడల బాధ తక్కువే, అధిక వర్షాలను కూడా తట్టుకుంటుంది. ఎకరాకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది.