వరంగల్ మార్కెట్‌లో బంగినపల్లి మామిడికి రికార్డు ధర!
వరంగల్ ఎనుమాముల ముసలమ్మ కుంటలో గురువారం ప్రారంభమైన నూతన మామిడి మార్కెట్‌లో తొలి రోజే బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన రైతు విజయపాల రెడ్డి తీసుకువచ్చిన బంగినపల్లి మామిడిని టన్నుకు రూ.1.22 లక్షలకు కొనుగోలు చేశారు. మార్కెట్ చరిత్రలో మామిడికి ఇంత గరిష్ట ధర నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.