08 Apr , 2025

ట్రంప్ సుంకాలతో మామిడి ఎగుమతులపై పడనున్న భారం !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 26% ప్రతీకార సుంకాలు భారతీయ మామిడి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని మామిడి రైతులు ఈ ఎగుమతులపై కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల ఎగుమతులు ఈ సుంకాల పెంపుతో తగ్గిపోతున్నాయి. ఇండియా మొత్తం మీద 7,64,500 ఎకరాల్లో మామిడి సాగుతూ, ఏటా 24,45,900 టన్నుల ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 45,000 టన్నుల మామిడి అమెరికాకు ఎగుమతవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 10,000-15,000 టన్నులు అమెరికా ఎగుమతవుతుంది. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.150-230 కోట్లు, కానీ ట్రంప్ సుంకాల కారణంగా ధరలు రూ.50 కోట్లు పెరిగే అవకాశముంది.