05 Sep , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!

రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ, ఉత్తరాంధ్ర, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నాలుగు రోజులపాటు వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈసారి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ అల్ప పీడనం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని ఐఎండీ సూచించింది.

05 Sep , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

Widespread "Heavy Rainfall" Expected Across Several Indian States....!!

Heavy to very heavy rainfall is forecast over Gujarat and Rajasthan today, with a similar pattern expected over Coastal Andhra Pradesh and Telangana over the next two days before a gradual decrease in intensity. In addition, heavy rainfall is likely at isolated locations in Jharkhand, Andaman and Nicobar Islands, Arunachal Pradesh, Nagaland, Assam, and Meghalaya. Other regions experiencing scattered heavy rainfall include Himachal Pradesh, Uttarakhand, Punjab, Haryana, western Uttar Pradesh, Madhya Pradesh, West Bengal, Sikkim, Bihar, Konkan and Goa, Madhya Maharashtra, the Gujarat region, and Karnataka. Residents in these areas are advised to stay alert and follow local advisories as weather conditions may lead to localized flooding and disruptions.

03 Sep , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

భారీ వర్షాలు - నీట మునిగిన పంట పొలాలు !!

ఆంద్రప్రదేశ్ లో బారీ వర్షాలకు పంట పొలాలన్ని బాగా దెబ్బతిన్నాయి. ప్రకాశం బ్యారేజికి భారీగా వరద రావడంతో కృష్ణానది తీర ప్రాంతాలైన దుగ్గిరాల మండలం పెదకొండూరు, మంచికలపూడి, వడవర్రు గ్రామాల పరిదిలో పంటలు నీట మునిగాయి. పసుపు, కంద, అరటి మినుము పంటలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. వరదలు త్వరగా తగ్గకపోతే మినుము పంట పూర్తిగా నాసనమయ్యే అవకాశం ఉందని , పసుపు, కంద రెండు రోజులలో వరద తగ్గకపోతే దుంపలు నేలలోనే కుళ్ళిపోయే ప్రమాదం ఉందని, దీనికి పెట్టుబడి కూడా ఎక్కువే అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

31 Aug , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పత్తిలో ఒకేసారి - ఎరువులు వేయడం...కలుపు తీయడం...!!

తెలంగాణలో పత్తి పంట అధికంగా సాగవుతుంది. అయితే పంటకు ఎరువులు, కలుపు ఒకేసారి పిచికారి చేస్తే ఖర్చు, శ్రమ రెండు తగ్గుతుందని – నల్గొండ, చిట్యాల మండలం మొగిలిదొరి గ్రామానికి చెందిన కొండె శ్రీశైలం - అలోచించి తనకున్న మూడెకరాల పొలంలో ఆధునిక సాగుయంత్రమైన మినీట్రాక్టర్ సాయంతో ఏడు నాగళ్ల సెట్ తో కూడిన కల్టివేటర్, దానిపైన డబ్బా బిగించాడు. ఆ డబ్బా నుంచి ఎరువు సాళ్లకు కొద్దిదూరంలో పడేవిధంగా ముందు వరుసలోని నాగళ్ల వరకు పైపులను అమర్చాడు. పత్తిలో సాళ్ల మధ్య గల కలుపు మొక్కలను తొలగించడానికి కల్టివేటర్ తో దున్నడంతోపాటు ఒకేసారి మూడు వరుసలలోని మొక్కలకు ఎరువు వేయొచ్చు. ఎకరం పత్తిచేలో కలుపు తీయడానికి మరియు ఎరువు వేయడానికి గంట సమయం పడుతుంది. ఎకరాకు 2 లీటర్ల డీజిల్ అవసరం. దీనివల్ల ఏకకాలంలో రెండు పనులు పూర్తి కావడంతో పాటు సగానికిపైగా ఖర్చు, సమయం ఆదా అవుతోంది.


29 Aug , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఉల్లికి పెరిగిన డిమాండ్!!

మహారాష్ట్రలో ఉల్లి నిల్వలు తగ్గడంతో కర్నూల్ మార్కెట్ లో ఉల్లికి డిమాండ్ పెరిగింది . మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా దిగుబడులు తగ్గాయి. వ్యాపారులు గత వారం నాణ్యతను బట్టి కిలో రూ.35 నుంచి రూ. 40 అమ్మగా ఈ వారం రూ. 55 కి విక్రయిస్తున్నారు. వారం వ్యవధిలో ఒక్కసారిగా రూ.15 పెరిగింది.

28 Aug , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

16th గ్రాండ్ నర్సరీ మేళా !!

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో గ్రాండ్ నర్సరీ మేళా - 2024 ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 2 వరకు 16th గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. ఈ అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శనను అగ్రికల్చర్ మినిస్టర్ ఆగస్ట్ 29 ఇనాగురేట్ చేయనున్నారు. ఈ నర్సరీ మేళా అయిదు రోజుల పాటు కొనసాగనుంది. దీనిలో వివిధ రకాల విత్తన, ఎరువులు, రకరకాల పూల, సుగంధ, ఔషధ మొక్కలను మరియు వ్యవసాయ, ఉద్యాన, ఆర్గానిక్ సంబందిత రకరకాల ఉత్పత్తులను చూడవచ్చు.

21 Aug , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తగ్గనున్న ఎండలు - పెరగనున్న వర్షాలు !!

ప్రస్తుతం బంగ్లాదేశ్ మీదుగా ఒక అల్పపీడనం కొనసాగుతుండడంతో ఒకసారి గా ఈ రోజు తెలంగాణ, రాయలసీమ & విశాఖ నుంచి పైన వున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వర్షాలు పడ్డాయి. ఈ నెల 24 తారీఖున పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంకు చేర్చి వున్న దక్షిణ ఒరిస్సా మీదుగా అల్పపీడనం ఏర్పడి మధ్య భారతం గుండా ప్రయాణించే అవకాశం వుండడం వలన ఉత్తర , మధ్య ఆంధ్రప్రదేశ్ & మొత్తం తెలంగాణ అంతటా 23,24,25,26,27 తారీఖు లలో మంచి వర్షాలు పడే అవకాశం ఉంది .


20 Aug , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు గుడ్ న్యూస్ !!

ఇటివల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 36 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విత్తన, పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం పెంచాలని సూచించారు. ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తిలో ఏపి అగ్రస్థానంలో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సాగులో కొరత లేకుంగా చూడాలని, , 2014-19 మధ్య కాలంలో ఈ రంగానికి ఉన్న పథకాలన్నీ మళ్లీ అమల్లోకి తీసుకురావాలని అధికారులకు ప్రత్యేక వ్యవసాయ పథకాలపై సమాచారం ఇచ్చారు

06 Aug , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతుబడి మెగా అగ్రి షో !!

నల్గొండలోని నాగార్జున గవర్నమెంట్ కాలేజిలో ఆగస్టు 17, 18 తేదిల్లో రైతుబడి మెగా అగ్రి షో తెలుగు రైతుబడి రాజేందర్ రెడ్డి ఆద్వర్యంలో జరగబోతుంది. ఇందులో భాగంగా 150 పైగా దేశవిదేశాల నుండి వివిధ కంపనిలతో పాటు రైతులు తయారు చేసినటువంటి అనేక వినూత్న పరికరాలు ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి డైరీ, పౌల్ట్రీ, సెరికల్చర్, హార్టికల్చర్ మరియు వ్యవసాయ యంత్రాలు ఇలా అనేక కొత్త వ్యవసాయ సమాచారాలను తెలుసుకోవచ్చు. రైతులందరూ పాల్గొని ఈ అవకాశాన్ని ఉపయోగించుచుకోగలరు. పూర్తి వివరాల కొరకు https://rbagrishow.com/

29 Jul , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

శ్రీశైలం మూడు గేట్లు ఎత్తివేత !!

భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్‌లు నిండుకున్నాయి. దీంతో శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం అధికారులు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన 6, 7, 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తగా.. 81వేల క్యూసెక్కుల వరద స్పిల్‌వే మీదుగా నాగార్జున సాగర్‌ వైపు పరుగులు తీస్తున్నది. ప్రస్తుతం ఒక్కో గేట్‌ నుంచి 27వేల క్యూసెక్కుల నీరు దిగుకు వెళ్తున్నది.