06 Jan , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

టమాటా ధర భారీగా పతనం

టమాట పంటతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా మెదక్ నర్సాపూర్ లో ఒక రైతు 2 ఎకరాల్లో 7,500 K G ల టమాటా పంటను దున్నేసి కాల్చేశారు. కిలో 2/- ఉండటంతో కూలీ కర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. కర్నూల్ జిల్లాలో టమాటా కేజీ కి పడిపోయింది.

11 Dec , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు!

అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుంది . మొక్కలకు 90శాతం సబ్సిడీ, డ్రిప్కు ఎస్సీ ఎస్టీలకు 100శాతం, బీసీలకు 80శాతం, నాలుగేళ్ల వరకు నిర్వహణకు ఎకరాకు రూ.4.200 అందిస్తుంది. నాలుగు సంవత్సరాల నుండి పంట దిగుబడి మొదలై 35 సంవత్సరాల వరకు వస్తుంది. ఈ పంటకు చీడపీడల బాధ తక్కువే, అధిక వర్షాలను కూడా తట్టుకుంటుంది. ఎకరాకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది.

06 Dec , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు!

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకైనా తీసుకెళ్లే స్వేచ్ఛ ఉందని సీఎం తెలిపారు. అలాగే, సేకరించిన ధాన్యం పేమెంట్‌ను 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు

06 Dec , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మ్యాజిక్ రైస్ వేడి నీళ్ళు లేకుండా అన్నం రెడీ!!

అగోనిబోరా రైస్ లేదా మ్యాజిక్ రైస్ పాలక్కాడ్‌లో ఉన్న ఎలప్పుల్లి లోని అథాచి గ్రూప్‌కి చెందిన వ్యవసాయ క్షేత్రం ద్వారా సాగు చేయబడింది. ఉడికించే అవసరం లేకుండా కేవలం వేడి నీటిలో 15 నిమిషాలు లేదా చల్లని నీటిలో 30 – 45 నిమిషాలు నానబెడితే చాలు ఉడికిపోతుంది. జూన్ లో ప్రారంభం అయిన పంట ఇటీవల పంట కోతకు వచ్చింది. విత్తనాలను మొలకెత్తించి 20 రోజుల తరువాత పొలంలో నాటారు. ప్రకృతి వ్యవసాయంలో పండించారు. కీటకాల బెడద చాలా తక్కువగా ఉంది. వరి మొక్క 3 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. 100 – 110 రోజులలో కోత కోశారు. 12 సెంట్లు భూమిలో 170 కిలోలు వరి పండించారు.


22 Nov , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌧️ఏపీకి భారీ వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం 🌀

బంగాళాఖాతంలో శనివారం ఏర్పాడే అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వానగండం పొంచి ఉంది. పంటలు చేతికొచ్చే కాలం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. దీని ప్రభావంతో నవంబర్‌ 26,27తేదీలలో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది.

13 Nov , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు గుడ్ న్యూస్ – యాసంగిలో రాయితీపై యంత్రాలు !!

తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలను సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకం కింద రోటావేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు అందిస్తామని తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

08 Nov , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

శనగ విత్తనాలకు 300 రూపాయల సబ్సిడీ!

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ శనగ రైతుల ప్రయోజనాల కోసం క్వింటాల్‌కు 300 రూపాయల సబ్సిడీని ప్రకటించారు. క్వింటాల్ కి Rs.9000 ధర ఉండగా, Rs.300 రాయితీతో , రైతులు Rs.8700 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ రేపటి నుండి అమలు కానుంది. ఈ యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన శనగ విత్తనాలు, JG 11, Jaaki రకాల 20,000 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అదనంగా, ఈ రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన వరి విత్తనాలు సమయానికి రైతులకు అందుబాటులో ఉండేలా వీలైనంత త్వరగా గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు.


08 Nov , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వ్యవసాయంలో మహిళలకు సమాన హక్కులు

వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ(మేనేజ్)లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, ఇక్రిశాట్ల ఆధ్వర్యంలో గురువారం వ్యవసాయ విస్తరణలో లింగ సమానత్వం, విధానాలు, సంస్థల్లో, కార్యక్రమాల్లో భాగస్వామ్యం అంశంపై అంతర్జాతీయ కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో మహిళలు కీలకంగా ఉన్నారని, వారికి భవిష్యత్తు విస్తరణ విధానాల్లో సరైన భాగ స్వామ్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమాల రూపకల్పన, అమలు, ఆవిష్కరణలు, పరిశోధనల్లోనూ గ్రామీణ స్థాయి నుంచి మహిళలకు పెద్దపీట వేయాలన్నారు. మహిళా రైతులకు శిక్షణ అందిస్తే వ్యవసాయంలో మరింత రానిస్తారారు అని కొనియాడారు.

07 Nov , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెల్లపత్తికి భిన్నంగా గోధుమ పత్తి:

ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు విశేష పరిశోధన చేసారు. సాధారణ తెల్లపత్తితో పాటు గోధుమ రంగు పత్తిని సాగు చేశారు. ఈ గోధుమ పత్తిని కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో పండిస్తున్నారు. తెల్లపత్తి కంటే దీని దిగుబడి ఎక్కువగా ఉందని గోధుమ రంగు పత్తికి ధర కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ పత్తి సాగుపై ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. వివరాలు: వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆదిలాబాద్

22 Oct , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మినుము విత్తనాలు అందుబాటులో కలవు!

TBG 104 రకం: పంటకాలం 70-75 రోజులు, అన్ని కాలాలకు అనుకూలం, పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. LBG 904 రకం: పంట కాలం 85 to 90 రోజులు. అన్ని కాలాలకు అనుకూలం. పల్లాకు తెగులును తట్టుకునే రకం. దిగుబడి 8-9 క్వి / ఎ. అధిక దిగుబడినిచ్చే రకం. గింజలు మద్యస్త లావు కలిగి మెరుస్తుంటాయి. మెషిన్ కోతకు అనుకూలం. కృషి విజ్ఞాన కేంద్రం, దరిశి, ప్రకాశం జిల్లా. Ph No: 9885878448.