NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు గుడ్ న్యూస్ – యాసంగిలో రాయితీపై యంత్రాలు !!
తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలను సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకం కింద రోటావేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు అందిస్తామని తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
శనగ విత్తనాలకు 300 రూపాయల సబ్సిడీ!
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ శనగ రైతుల ప్రయోజనాల కోసం క్వింటాల్‌కు 300 రూపాయల సబ్సిడీని ప్రకటించారు. క్వింటాల్ కి Rs.9000 ధర ఉండగా, Rs.300 రాయితీతో , రైతులు Rs.8700 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ రేపటి నుండి అమలు కానుంది. ఈ యాసంగి సీజన్లో రైతులకు అవసరమైన శనగ విత్తనాలు, JG 11, Jaaki రకాల 20,000 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అదనంగా, ఈ రబీ సీజన్లో రైతులకు అవసరమైన వరి విత్తనాలు సమయానికి రైతులకు అందుబాటులో ఉండేలా వీలైనంత త్వరగా గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయంలో మహిళలకు సమాన హక్కులు
వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ(మేనేజ్)లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, ఇక్రిశాట్ల ఆధ్వర్యంలో గురువారం వ్యవసాయ విస్తరణలో లింగ సమానత్వం, విధానాలు, సంస్థల్లో, కార్యక్రమాల్లో భాగస్వామ్యం అంశంపై అంతర్జాతీయ కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో మహిళలు కీలకంగా ఉన్నారని, వారికి భవిష్యత్తు విస్తరణ విధానాల్లో సరైన భాగ స్వామ్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమాల రూపకల్పన, అమలు, ఆవిష్కరణలు, పరిశోధనల్లోనూ గ్రామీణ స్థాయి నుంచి మహిళలకు పెద్దపీట వేయాలన్నారు. మహిళా రైతులకు శిక్షణ అందిస్తే వ్యవసాయంలో మరింత రానిస్తారారు అని కొనియాడారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెల్లపత్తికి భిన్నంగా గోధుమ పత్తి:
ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు విశేష పరిశోధన చేసారు. సాధారణ తెల్లపత్తితో పాటు గోధుమ రంగు పత్తిని సాగు చేశారు. ఈ గోధుమ పత్తిని కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో పండిస్తున్నారు. తెల్లపత్తి కంటే దీని దిగుబడి ఎక్కువగా ఉందని గోధుమ రంగు పత్తికి ధర కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ పత్తి సాగుపై ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. వివరాలు: వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆదిలాబాద్
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మినుము విత్తనాలు అందుబాటులో కలవు!
TBG 104 రకం: పంటకాలం 70-75 రోజులు, అన్ని కాలాలకు అనుకూలం, పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. LBG 904 రకం: పంట కాలం 85 to 90 రోజులు. అన్ని కాలాలకు అనుకూలం. పల్లాకు తెగులును తట్టుకునే రకం. దిగుబడి 8-9 క్వి / ఎ. అధిక దిగుబడినిచ్చే రకం. గింజలు మద్యస్త లావు కలిగి మెరుస్తుంటాయి. మెషిన్ కోతకు అనుకూలం. కృషి విజ్ఞాన కేంద్రం, దరిశి, ప్రకాశం జిల్లా. Ph No: 9885878448.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మిద్దెతోటలపై సదస్సు !!
గుంటూరులో ఈనెల 10న బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో సాయంత్రం 2 గంటల నుంచి మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, ఉద్యానశాఖ ఏడీ రాజాకృష్ణారెడ్డి, గుంటూరుకు చెందిన టెర్రస్ గార్డెనర్ కె.కృష్ణకుమారి అవగాహన కల్పిస్తారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఈ నెల 22న ఉ. 10 గం. నుంచి అవగాహన సదస్సు జరుగుతుంది. ప్రవేశం ఉచితం. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. శిక్షణలో పాల్గొనేవారుకు 97053 83666 ఫోన్‌చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పంట బీమా పథకం ఈ-కేవైసీకి ఈ నెల 15కు ముగుస్తుంది !!
ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన రైతులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.పంట బీమా పొందేందుకు రైతులు తమ పంటలకు ఈ-కేవైసీ చేయించుకోవాలి. దీని గడువు ఈనెల 15 వరకు ఉంది. "పంట బీమా పథకం" కొరకు ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలను వ్యవసాయశాఖ సిబ్బందికి తెలియజేయాలి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు ఈకేవైసీ ప్రక్రియ మొదలైంది. తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ చేస్తారు. రైతు ఆధార్, మొబైల్ నంబర్, పొలం సర్వే నంబర్ తో పాటు పొలం వద్ద ఫొటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేస్తారు. పంట నమోదు పూర్తైన తర్వాత ఈ-కేవైసీకి వేలిముద్రలు తీసుకుంటారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!
రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ, ఉత్తరాంధ్ర, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నాలుగు రోజులపాటు వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈసారి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ అల్ప పీడనం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని ఐఎండీ సూచించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
Widespread "Heavy Rainfall" Expected Across Several Indian States....!!
Heavy to very heavy rainfall is forecast over Gujarat and Rajasthan today, with a similar pattern expected over Coastal Andhra Pradesh and Telangana over the next two days before a gradual decrease in intensity. In addition, heavy rainfall is likely at isolated locations in Jharkhand, Andaman and Nicobar Islands, Arunachal Pradesh, Nagaland, Assam, and Meghalaya. Other regions experiencing scattered heavy rainfall include Himachal Pradesh, Uttarakhand, Punjab, Haryana, western Uttar Pradesh, Madhya Pradesh, West Bengal, Sikkim, Bihar, Konkan and Goa, Madhya Maharashtra, the Gujarat region, and Karnataka. Residents in these areas are advised to stay alert and follow local advisories as weather conditions may lead to localized flooding and disruptions.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
భారీ వర్షాలు - నీట మునిగిన పంట పొలాలు !!
ఆంద్రప్రదేశ్ లో బారీ వర్షాలకు పంట పొలాలన్ని బాగా దెబ్బతిన్నాయి. ప్రకాశం బ్యారేజికి భారీగా వరద రావడంతో కృష్ణానది తీర ప్రాంతాలైన దుగ్గిరాల మండలం పెదకొండూరు, మంచికలపూడి, వడవర్రు గ్రామాల పరిదిలో పంటలు నీట మునిగాయి. పసుపు, కంద, అరటి మినుము పంటలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. వరదలు త్వరగా తగ్గకపోతే మినుము పంట పూర్తిగా నాసనమయ్యే అవకాశం ఉందని , పసుపు, కంద రెండు రోజులలో వరద తగ్గకపోతే దుంపలు నేలలోనే కుళ్ళిపోయే ప్రమాదం ఉందని, దీనికి పెట్టుబడి కూడా ఎక్కువే అని రైతులు ఆవేదన చెందుతున్నారు.